ఉగాది రోజున ఇలా చేస్తే.. వెయ్యిరెట్ల ఫలితం మీ సొంతం..!! ఉగాది మనకు కొత్త ఏడాది ప్రారంభమైన రోజు. ఆ రోజున రోజున తెల్లవారు జామున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో పూజ చేయడం మించిందని పండితుల సలహా. ఉగాది రోజున బ్రహ్మి ముహూర్తాన నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసిన తరువాత ఇంటిని అలంకరించుకోవాలి. గుమ్మానికి మామిడాకుల తోరణాలు, అలాగే, పూజ గదిలో కుంకుమ, పుష్పాలు రంగవల్లికలతో ఇష్టదైవాలను అలంకరించుకోవాలి.
see also : ప్రత్యేక హోదా తీసుకువచ్చే ఏకైక మగాడు జగన్ ఒక్కడే ..!
రెండు దూది వత్తులు, ఆవు నెయ్యిలతో దైవానికి పూజ చేయాలి. అనంతరం ఉగాది పచ్చడిని ఇష్టదైవాలకు నైవేధ్యంగా పెట్టాలి. అయితే, ఉగాది నుంచే నవరాత్రులు ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. ఆలయాల్లో నవరాత్రులు నిర్వహించడం వల్ల సకల సందపదలు సమకూరుతాయని పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నారు. అలాగే, మహిళలు ఉగాది రోజున నుదుట కుంకుమ ధరించి శ్రీరాముడ్ని పఠిస్తే ఇంటిల్లపాది మంచి జరుగుతుంది.