నీరవ్ మోడీ, ఇతనో వజ్రాల వ్యాపారి, అంతకు మించి ఓ స్కామ్ స్టార్. ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంతో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ స్కామ్ స్టార్‌గా భారత్‌దేశంలోని అందరికి సుపరిచితుడయ్యాడు. నీరవ్ మోడీ పుట్టింది భారత్‌లోనే అయినా.. పెరిగింది మాత్రం బెల్జియంలోనే. అంతేకాదు, న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన తన వజ్రాల వ్యాపారానికి సంబంధించిన షాప్ ఓపెనింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సైతం పలిపించి.. షాప్‌ను ఓపెన్ చేయించారు. నీరవ్ మోడీ. తన షాప్ ఓపెనింగ్‌కు డోనాల్డ్ ట్రంప్‌నే రప్పించాడంటే నీరవ్‌మోడీ వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇటీవల కాలంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే నీరవ్‌మోడీ, చంద్రబాబు భారీ కుంభకోణం. ఇందుకు కొన్ని కారణాలను కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తలు సంచలనంగా మారాయి.
see also : డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి తుమ్మల
see also : ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో భాగంగా నీరవ్ మోడీ ఆస్తులపై ఆరా తీస్తున్న సీబీఐ అధికారులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అయితే, నీరవ్ మోడీకి గుంటూరుకు చెందిన ఓ బఢా రాజకీయ నేతతో సంబంధాలు ఉండటం, అందులోను ఆ రాజకీయ నేత ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంకు చెందిన వ్యక్తి కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో సీబీఐ అధికారులు మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సారాంశం. ఇప్పటికే నీరవ్ మోడీ, చంద్రబాబు, గుంటూరు వ్యాపారి గురించి సగం ఆధారాలు సేకరించారని, మరికొద్ది రోజుల్లోనే ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలతో కేసు పైల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా… కేజీ బేసిన్ గ్యాస్ అంటూ అంబానీతో కలిసి కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా నీరవ్ మోడీతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.