ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. మా బడ్జెట్ అంకెల గారడీ ఎంత మాత్రం కాదన్నారు..సీఎం కేసీఆర్ మాటలు అక్షర సత్యాలుగా అమలవుతాయని బడ్జెట్ మరోమారు నిరూపించిందన్నారు . ఉమ్మడి రాష్ట్ర పాలనలో జీడీపీ 5 శాతం గా నమోదయ్యేది ..ఇపుడు తెలంగాణ జీడీపీ రెండంకెల స్థాయిని దాటిందన్నారు.
see also : వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన లోక్ సభ స్పీకర్ ..!
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు వస్తే టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయనున్నట్లు తెలిపారు.రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ,సీఎం కెసిఆర్ పై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే అరిగిపోయిన రికార్డు లా తెలంగాణ కాంగ్రెస్ వల్లే వచ్చిందంటున్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు గత ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు.కేసీఆర్ లేకుంటే తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఎపుడో అమ్మేసే వారే అని ఎమ్మెల్సీ కర్నె చెప్పారు.
see also :జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!