ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. 40వ ఓవర్లో జెస్ జోనసెన్ వేసిన బంతిని ఎదుర్కొన్న పూజ దాన్ని సిక్స్‌గా మలిచింది. అది కాస్త బౌండరీ లైన్ ఆవల ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. దీంతో స్కోరు బోర్డు కాస్త చెల్లా చెదురైంది. బౌలర్ జెస్ కూడా పూజను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఈ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాదు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌కు కూడా కోల్పోయింది. ఇక సిరీస్‌లో చివరి వన్డే ఆదివారం జరగనుంది.
VIDEO: Pooja Vastrakar's six leaves scoreboard in tatters.
She smashed a Jess Jonassen delivery in the 2nd ODI at Baroda so hard that it landed on the manual scoreboard leaving it in a big mess #INDvAUS – https://t.co/sKeun1YJhB— BCCI Women (@BCCIWomen) March 15, 2018