జనసేన అధినేత, పవన్ కల్యాణ్ అన్న ఆ ఒక్క మాటతో కాపు ఓటర్లందరూ వైఎస్ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, 2014 ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత, బీజేపీ పార్టీలతో కలిసి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో డబ్బు నోట్ల కట్టలను వరదలా పారించి మరీ అక్కడి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇలా చంద్రబాబు తన కుట్ర రాజకీయ అనుభవాలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అమలు కాని హామీలతో గద్దెనెక్కాడని పలు పత్రికలతోపాటు.. సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే.
see also : ”జగన్‌తో ఏకీభవించిన పవన్ కల్యాణ్”..!!
see also : వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
ఇదిలా ఉండగా.. బుధవారం గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. అటు చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు అవినీతిని కార్యకలాపాలను, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి, లోకేష్‌కు ఉన్న అవినీతి సంబంధాలను జనసేన ఆవిర్భావ సభ వేదికగా వెల్లడించారు పవన్ కల్యాణ్. ఇలా పవన్ కల్యాణ్ తన ప్రసంగం ఆద్యాంతం చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తూనే జరిగింది. పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తూ తిరగడటంతో గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను నమ్మి తమ ఓట్లన్నీ టీడీపీకే వేసి మోసపోయామని, ఈసారి అలా కాకుండా తమ ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేయాలని కాపు వర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం.