జనసేన ఆవిర్భావ సభ షో హీరో, విలన్, కమెడియన్లు వీరే..!! అవును, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, జనసేన ఆవిర్భావ షో ఏంటి..? అందులో హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్‌లు ఏంటి..? అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ ఇండస్ర్టీ నుంచి రాజకీయాలవైపు వచ్చిన వ్యక్తి అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసినా అందుకు రివ్యూలు రాసేందుకు సినీ క్రిటిక్‌లు వెంటనే తమ కలానికి పదునుపెడతారు. సినిమా హిట్టా..? ఫట్టా అనే కాన్సెప్ట్‌తో రివ్యూను ముగుస్తారు. చివరకు అందులో హీరో ఎవరు..? విలన్ ఎవరు..? కమెడియన్ ఎవరు..? అన్న విషయాలను అందులో జోడిస్తారన్న విషయం జగమెరిగిన సత్యం.
పవన్ కల్యాణ్ సినీ ప్రస్థావనాన్ని అనుసరించిన సాధారణ ప్రజలు బుధవారం గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి.. సభ హిట్టా..? ఫట్టా..? అందులో ఎవరికి ఏ పాత్రలు అన్న కోణంలో నెటిన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేశారు. ఓ సారి ఆ కామెంట్ల సారాంశాన్ని పరిశీలిస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాన్ సభ ఆధ్యాంతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తిడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చంద్రబాబునే కాకుండా తన తనయుడు నారా లోకేష్‌కు, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మీడియా ముందుకు తెచ్చారు. అలాగే, చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో దోచుకుంటున్న నిధులు, భూ కుంభకోణాలు, పోలవరం నిధులను చంద్రబాబు సర్కార్ పక్కదారి పట్టించడాన్ని పవన్ కల్యాణ్ ఎండగట్టాడు. అయితే, గత నాలుగు సంవత్సరాల నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కార్ అవినీతి గురించి చెప్పిన విషయాన్ని పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలోను చెప్పారు.
అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అవినీతి గురించి తెలుసి కూడా టీడీపీ కోసం ప్రచారాని వెళ్లిన పవన్ కల్యాణ్ గత నాలుగు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఏపీలో చేస్తున్న అవినీతి, మహిళలపై దాడుల గురించి ప్రశ్నించని పవన్ కల్యాణ్ నేడు పెదవి విప్పడంపై మతలబేమిటని సామాన్య జనం చర్చించుకుంటున్నారు. ఏదేమైనా జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు విలన్‌కాగా, 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చి పవన్ కల్యాణ్ కమెడియన్‌గానే మిగిలిపోగా.. 2014 ఎన్నికల నుంచి ప్రత్యేక హోదా మాటపైనే నిలబడి.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ, నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల మస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ.. ప్రజల పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్న నూటికి నూరుశాతం హీరో మార్కులు కొట్టేశాడని సామాన్య జనం (మిస్టర్ ఫర్‌పెక్ట్) సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు.