తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్‌లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ 21,961 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు.
see also :గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
see also :లోకేష్ అవినీతిని బట్టబయలు చేసిన పవన్ కళ్యాణ్
`ఉత్తరప్రదేశ్ లోక్‌సభ స్థానాల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీను ఢీల్లీలో కూర్చోబెట్టిన రాష్ట్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. మరో జాతీయ పార్టీ మళ్లీ ధరావతును కూడా కోల్పోయింది. ఏదీ శాశ్వతం కాదని సందేశాన్ని పంపింది.` అంటూ మంత్రి కేటీఆర్ స్పందించారు. తద్వారా జాతీయ పార్టీలపై నమ్మకం కోల్పోతున్న తీరు, ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కడుతున్న విధానాన్ని మంత్రి కేటీఆర్ స్పష్టంగా తెలియజెప్పారు.