కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్, హాకా, నాఫెడ్ సంస్థలను మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అసెంబ్లీ కమిటీ హాలులో గురువారం కందులు, మినుములు, శెనగలు, ఎర్ర జొన్న ల కొనుగోళ్ళు, చెల్లింపుల పై మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు సమీక్షించారు.తెలంగాణ అంతటా 2 లక్షల 58 వేల 347 మెట్రిక్ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించింది.ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితి 75 వేల 300 మెట్రిక్ టన్నులు మాత్రమే.1 లక్షా 83 వేల మెట్రిక్ టన్నుల కందులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా 184 కోట్లు వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు అందవలసి ఉన్నది.తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్ల విలువ చేసే కందుల కొనుగోలు చేసింది.600 కోట్లు చెల్లించింది. మరో 400 కోట్లు చెల్లించవలసి ఉన్నట్టు అధికారులు మంత్రులకు వివరించారు.మార్క్ ఫెడ్, నాఫెడ్, హాకా తదితర ఏజెన్సీల పనితీరుపై మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆయా సంస్థల పని తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పార్ధసారధి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,జాయింట్ డైరెక్టర్లు లక్ష్మణుడు,రవికుమార్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
