తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అదేవిధంగా శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే ఉభయసభలు ఈ నెల 18 వరకు వాయిదా పడనున్నాయి.
see also :గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
కాగా ఇవాళ ఉదయం మంత్రి ఈట ల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచిగా ఉండబోతుందని తెలిపారు.అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. నీటిపారుదల రంగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధ్యానత ఇచ్చామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పైగా వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం.