ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నంలో గత సంవత్సరం జరిగిన భూ కుంభకోణాన్ని మరిచిపోకముందే చంద్రబాబు సర్కార్ కు సంబంధించి మరో తాజా భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కుంభ కోణం కూడా విశాఖపట్నంలో జరగడం గమనార్హం. ఇలా ఎంతో విలువైన విశాఖ భూములను చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పదవి దిగిపోయేలోగా కాజేయాలని కుట్రపన్నుతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చంద్రబాబు తాజా కుంభకోణం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సమాచారం మేరకు.. వివరాలిలా ఉన్నాయి.
see also : వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత..!
విశాఖపట్నం పరిధిలోగల, ఖరీదైన ప్రాంతమైన రుషికొండ ఏరియాపై చంద్రబాబు సర్కార్ పడింది. ఎలాగో అధికారంలో ఉన్నాము కదా..? భూమిని ఆక్రమించినా అడిగేవారెవరు ఉన్నారనుకున్నారేమోగానీ.. రుషికొండ ఏరియాను దోచేసేందుకు ప్రణాళిక రచించారు. అనుకున్నదే తడవుగా ప్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీని రంగంలోకి దింపారు. మీరు కంపెనీ పెట్టుకునేందుకు ప్రభుత్వం తరుపున రుషికొండలో భూమిని కేటాయిస్తాం, ఆ తరువాత 25 ప్లస్ 15 చొప్పున పంచుకుందాం అంటూ చంద్రబాబు సర్కార్ ప్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్నోవా సెల్యూషన్స్ కంపెనీలతో బేరం కుదుర్చుకున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సారాంశం. అయితే, రుషికొండలో ఒక్క ఎకరం విలువ 10 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్న విషయం తెలిసిందే.
see also : పవన్ అన్న ఆ ఒక్క మాటతో.. కాపు ఓట్లన్నీ జగన్‌కే..!!
అయితే, చంద్రబాబు సర్కార్ మాత్రం ఒక్క ఎకరం రూ.32.5 లక్షల వంతున పైన చెప్పిన రెండు కంపెనీలకు కేటాయించింది. ఇలా ఆ కంపెనీలకు 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం 13 కోట్లకే అప్పచెప్పడంలో ఆంతర్యమేమిటని విశాక వాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ భూమిని ఆ రెండు కంపెనీలకు కేటాయించినా.. చివరకు సగం భూమి టీడీపీ నేతలకు చెందడం ఖాయం. ప్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్నోవా సెల్యూషన్స్ కంపెనీలతో 2500 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కార్ ఆంతర్యం ఇన్నాళ్లకు అర్థమయిందంటున్నారు విశాఖ వాసులు.