అగ్గి లాంటి ఎండలో అయిన ఒక్క అడుగు పడగానే ఆ కరువు నేలంత ఆనందంతో పులకరించింది. అప్పటి వరకూ పొలం పనుల్లో అలసి, భోజనం చేస్తున్న మహిళా కూలీలకు అల్లంత దూరంలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రగా కొన్నివేల మందితో తరలి వస్తూ కనిపిం చారు. అంతే ఒక్క సారిగా వారు అన్నం పక్కనపెట్టి, రోడ్డుపైకి పరుగున వచ్చారు. పరిగెత్తుకుంటూ వస్తున్న మహిళలను గమనించిన వైఎస్ జగన్ రోడ్డుపైనే నిలబడి దారిలో ఉన్న కాలువను మెల్లగా దాటి రావాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మేలు పొందామని, వేళకు నాలుగు మెతుకులు తిన్నామని, ఇప్పుడు కష్టాలు చుట్టుముట్టాయని మర్రిపూడి గ్రామానికి చెందిన వాలి లక్ష్మి, మచ్చామతి శివపార్వతి, దొడ్లి శివనాగరాణి, పగడపు కుమారి, వై దేవి, బొల్లా మేరీకుమారి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మహిళా కూలీలను జగన్ చిరునవ్వుతో పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. జననేత పలకరింపుతో మహిళలు ఆనందంతో పొంగిపోయారు. అంతేకాదు పాదయాత్రలో ఉన్నవారు కూడ వైఎస్ జగన్ ఆ మహిళను పలకరిస్తున్న తీరు చూసి ఆనందంలో వారు కేకలు,ఈలాలు వేస్తు ఏంతో ఉత్సాహంగా జగన్ తో అడుగులో అడుగు వేస్తున్నారు.
