తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అరవై ఏండ్లలో ఏ నాయకుడి వలన కానిది ..
ఎవరు తీసుకురాలేని తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు ఏళ్ళ పాటు కోట్లాడి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించి పెట్టి అరవై యేండ్ల కలను సాకారం చేసి చరిత్ర సృష్టించారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
అంతే కాకుండా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టాన్ని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథంలో నిలుపుతూ దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తున్నారు..రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.