జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇందులో కొన్ని భద్రతపరమైన సూచనలు ఉండగా…మరికొన్ని ఆశ్చర్యపరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మద్యం తాగి సభకు రావద్దనడం ఏమిటని షాక్ అవుతున్నారు. తమ గురించి ఎలాంటి భావనతో ఇలాంటి సూచనలు చేశారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
see also :బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..!
see also :మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!
కాగా, జనసేన రూపొందించిన మార్గదర్శకాలు ఇవి
1.టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు.
2. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగించకుండా వారికి దారి ఇవ్వాలి.
3. ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాని నిలబెట్టండి.
4. పోలీసులతో, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి.
5. ప్రజలని గౌరవించండి. వారితో దురుసుగా ప్రవర్తించకండి.
6. మద్యం సేవించి వాహనం నడపకండి.
7. రోడ్లు మరియు ఇతర ప్రదేశాల్లో అనవసరంగా వాహనాలు ఆపకండి.
8. ఇతర వాహనాలని ఓవర్ టేక్ చేయకండి. అతి వేగం వద్దు, సాధారణ వేగంతో నడపండి.
9. ద్విచక్రవాహనాల సైలెన్సర్లు తీసి రోడ్లపై నడపకండి.
10. సభాస్థలిలో శాంతంగా ఉండండి, సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి.
11. అనుక్షణం పార్టీ హోదాని నిలబెట్టండి. వ్యక్తిగత ప్రాధాన్యత కంటే పార్టీ ప్రాధాన్యత ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.
12. చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్ల పైకి ఎక్కకండి.
13. విద్యుత్తు స్తంభాలకి దూరంగా ఉండండి.
14. జిల్లాలోని ప్రచారపత్రాల్లో పార్టీ ప్రెసిడెంట్ ఫోటో మరియు పార్టీ ఆమోదించిన వారి ఫోటోలు తప్ప వేరే ఎవరివీ ఉండకూడదు.”క్షేమంగా వచ్చి, క్షేమంగా వెల్లండి అని కోరారు.