ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి “ఓటుకు నోటు “కేసు తో రాత్రికి రాత్రే హైదరాబాద్ మహానగరాన్ని వదిలిపెట్టి విజయవాడ నగరంలోని కరకట్టకు పారిపోయాడు అని ఇటు నెటిజన్లు అటు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.
తాజాగా ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి గుడ్ బై చెప్పారు.అది ఎలా అంటారా ..?.నిన్న మొన్నటి వరకు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఓటు హక్కు ఉండేది.తాజాగా ఓటర్ల జాబితాలో ఆయన కుటుంబ సభ్యులు ఓట్లు ఆంధ్రలో ఉన్నట్లు ఓటు హక్కును అక్కడకి మార్పించుకున్నారు చంద్రబాబు నాయుడు.
దీంతో రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద తాత్కాలిక నివాసం ఉంటున్న ఇంటి చిరునామా ఇంటి నెంబర్ 3-781 ,తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం కింద ఓటు హక్కు కల్గి ఉన్నట్లు మొత్తం నారావారి కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేశారు.గతంలో లోకేష్ మాట్లాడిన ఓటు హక్కు ఏపీలో లేనివాళ్ళు ప్రజాసమస్యలపై మాట్లాడతారా అని మాటకు స్పందనగా నెటిజన్లు స్పందిస్తూ శభాష్ లోకేష్ ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే హక్కును సాధించావ్ అని సెటైర్లు వేస్తున్నారు ..