కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నీతుల చెప్పడం సిగ్గుచేటని ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 365ని దుర్వినియోగం చేసిన ఘటన ఆ పార్టీకే దక్కుతుందన్నారు.
see also :మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!
ఆర్టికల్ 365 ఆధారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అర్ధాంతరంగా రద్దు చేసి ముఖ్యమంత్రులను గద్దె దించిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నో రాష్ర్టాల ప్రభుత్వాలను అర్ధాంతరంగా దించివేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి చెప్పడం…`వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లుంది` అని వ్యాఖ్యానించారు.