ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
see also :అర్ధరాత్రి చంద్రబాబు కలలోకి వైఎస్ జగన్ రాగనే…లేచి నిలబడి..!
హైదరాబాద్ కు మంచినీరు, దండు మల్కాపురంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 19 వందల కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దండు మల్కాపురంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం 343 ఎకరాల భూమిని సేకరించామన్నారు. పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.