తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను శాసనసభ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఏకంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా హైదరాబాద్ మహానగరంలో గాంధీ భవన్ లో నలబై ఎనిమిది గంటలు అమరనిరాహర దీక్షకు దిగిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ రాష్ట్ర అధిష్టానం అదేశిస్తే ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనపై పోటికి
దిగుతాను అని ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించేశారు.
see also :ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
అయితే గతంలో తను నల్గొండ నుండే ఎంపీగా పోటి చేసి మరి జిల్లాలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తాను అని బీరాలు పలికిన సంగతి తెల్సిందే.ఈ వ్యాఖ్యలు చేసి పట్టుమని పది రోజులు కాకుండానే ఇలా మాట్లాడటం నరం లేని నాలుక నలబై మాట్లాడుతుంది అని అనడానికి మాజీ మంత్రి కోమటిరెడ్డిను ఉదాహరణగా చెప్పుకోవచ్చని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
see also :మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!