Home / POLITICS / తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి..!

తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి..!

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు మరోసారి విశ్వరూపం చూపించారు . తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు . పద్నాలుగేళ్ళ పాటు ఎన్నో కష్టాలకోర్చి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనకు ఈ రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసే బాధ్యత కూడా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు . ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి తెలంగాణకు నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోలేమని అన్నారు . పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, సాగు నీటి ప్రాజెక్టులు సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు . దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను తెలంగాణ అమలు చేస్తున్నదని తెలిపారు .

శాసనసభలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం అక్షర సత్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్పీచ్ విషయంలో ప్రతిపక్ష సభ్యులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సభ్యులందరూ తెలుసుకోవాల్సిన విషయమేమంటే.. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండే వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిందే చదవాలి. గవర్నర్ స్పీచ్‌కు కేబినెట్ ఆమోదం తెలపాలి. ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదవుతారు. ప్రభుత్వంలో జరిగే సత్యాలనే గవర్నర్ చదవి వినిపించారు. ప్రభుత్వం సాధించుకున్న లక్ష్యాలను.. నిర్దేశించుకున్న లక్ష్యాలను గవర్నర్ సభలో చదవి వినిపించారు. ఈ మధ్య కొందరు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సంఘటలను బాధను కలిగిస్తున్నాయని తెలిపారు. సభ్యులు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని సీఎం అన్నారు.

రాష్ట్ర అప్పులపై సీఎం కేసీఆర్ వివరణ
————————————————–
రాష్ట్ర అప్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టంగా వివరణ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై మాట్లాడారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్ర అప్పులపై కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలు సత్యదూరాలు అని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం.

రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎంత అప్పు ఉందో ఆ లెక్కలు ఆర్బీఐ దగ్గర ఉంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచి ఇచ్చిన అప్పు రూ. 72 వేల కోట్లు అని తెలిపారు. ఈ రోజు నాటికి పాతవి, కొత్తవి మొత్తం కలిసి అప్పు రూ. 1,42,000 కోట్లు. అలాంటప్పుడు రూ. 2 లక్షల కోట్ల అప్పులు ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఈ ఫిగర్స్ కాగ్, ఆర్బీఐతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద కూడా ఉంటాయి. 23 జిల్లాల ఏపీ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్ ఖర్చు రూ. 1,29, 683 కోట్లు. జానాభా ప్రకారం తెలంగాణకు రూ. 54 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ అంత ఖర్చు పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో తెలంగాణ క్యాపిటల్ ఖర్చు రూ. 1.25 కోట్లు. ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కిషన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నా. ఒక మిత్రుడిగా చెబుతున్నా. మీకు మంచి భవిష్యత్ ఉంది. ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి ప్రభుత్వాలకు లేదని కిషన్‌రెడ్డికి సీఎం సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు వచ్చే ఆదాయం రూ. 10 వేల 500 కోట్లు. రైతుల రుణమాఫీ కోసం కేంద్రం, ఆర్బీఐ చుట్టూ అనేకసార్లు తిరిగాం. వాళ్లు ఇవ్వకపోవడంతోనే నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామన్నారు. తాము రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఆ మేరకు రుణమాఫీ చేశామని సీఎం తెలిపారు. రూ. 2 లక్షల రుణం ఒక్కసారి మాఫీ చేస్తే.. పాలన స్తంభించి పోతుంది. ఇది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు.

ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు నిషేధించాం
——————————————————
ట్యాంక్‌బండ్‌పై ధర్నాలు, నిరసనలు నిషేధించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నిరసనకారుల పట్ల కఠినంగానే ఉంటాం. నిషేధాజ్ఞలు మేము తీసుకురాలేదు. చంద్రబాబు హయాంలో నిషేధాజ్ఞలు తీసుకువచ్చారు. అనుమతి లేకున్నా, కోర్టు వద్దన్నా ధర్నాలు చేస్తామంటే తాము అనుమతించం . ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలుపాలి. బస్సు యాత్రలు, పాదయాత్రలు ఆపామా? అని ప్రశ్నించారు. బస్సు యాత్రలు చేసి తుస్సుమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా ఉందని ఉద్ఘాటించారు. పరిమితికి లోబడి నిరసన తెలిపితే ఎవరైనా స్వీకరిస్తారు. అనుమతి లేకున్నా ధర్నాలు, నిరసనలు చేస్తామనడం సరికాదు. ధర్నాలు నిర్వహించుకునేందుకు సరూర్‌నగర్‌లో అవకాశం ఇచ్చాం. అక్కడ ధర్నా చేస్తే ఏమౌతుందని ప్రశ్నించారు. మంచి పద్ధతిలో ధర్నాలు, ర్యాలీలు చేయాలని సూచించారు. లేని వాటిని ఊహించుకుని తాము ప్రజాస్వామ్యబద్ధంగా లేమని ప్రచారం చేయడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి
——————————————————
సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సమపాళ్లలో నిధులు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి శాసనసభ వేదికగా సీఎం పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. సెక్రటేరియట్‌లో అవినీతిని తగ్గించాం. నాలుగేళ్లలో ఒక్క అవినీతినైనా నిరూపించారా? అని ప్రశ్నించారు. భూరికార్డుల ప్రక్షాళనతో రైతులు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టుల పనులు, సంక్షేమ పథకాలు అందరికీ కనబడుతున్నాయి.. కాంగ్రెసోళ్లకు ఎందుకు కనబడటం లేదు? అని సీఎం ప్రశ్నించారు.

పాలమూరును పచ్చగా మారుస్తున్నాం
————————————–
వచ్చే జూన్ తర్వాత పాలమూరు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. త్వరలోనే పాలమూరు పచ్చగా మారుస్తున్నాం. దేవాదుల నుంచి జనగామ, పాలకుర్తి, హుస్నాబాద్‌కు నీళ్లు ఇస్తాం. లోయర్ పెన్‌గంగా రీడిజైన్ చేసి చనకా – కొరాట బ్యారేజీ నిర్మిస్తున్నాం. రికార్డు టైమ్‌లో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేశామని గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీంటిని పూర్తి చేశాం. రీడిజైన్‌లపైనా కాంగ్రెస్ రాజకీయం చేసిందని మండిపడ్డారు.

ఎస్సీ వర్గీకరణ సాధిస్తా
—————————–
ఎస్సీ వర్గీకరణ సాధించి చూపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. మాదిగ బిడ్డలకు వర్గీకరణ న్యాయమైనది. గతంలో క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్‌గా ఉన్నప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిందని వాదించిన వ్యక్తిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణకు సంబంధించి శాసనసభ తీర్మానం చేసి పంపినం. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు తాను, కడియం శ్రీహరి.. వర్గీకరణపై ఐదు నిమిషాలు ప్రధాని మోదీకి వివరణ ఇచ్చి మెమోరాండం ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. వర్గీకరణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. శాసనసభ, రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అఖిలపక్షం ఆమోదం తెలిపిందని సీఎం వెల్లడించారు. మాదిగ బిడ్డలకు హామీ ఇస్తున్నా. మీ వెంట కేసీఆర్ ఉంటాడు. వర్గీకరణను సాధించి చూపిస్తా. మీరు నా వెన్నంటి ఉండండి. రభస చేయకండి. మాదిగ విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు హామీ ఇస్తున్నా. మీ తరపున నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే కిషన్‌రెడ్డి ఢిల్లీలో పోయి ధర్నా చేయాలి. మందకృష్ణ మాదిగను అరెస్టు చేస్తాం. భవిష్యత్‌లో కూడా అరెస్టులు ఉంటాయి. తెలుగు మహాసభల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లతో మందకృష్ణ కుమ్మకై ఆందోళనకు కుట్ర చేశాడు. ఆ సమయంలోనే ఆయనను అరెస్టు చేశాం. వర్గీకరణ మందకృష్ణతో సాధ్యం కాదు. ఆయన పని అయిపోయింది. వర్గీకరణ చేయమని కేంద్రమంత్రి కూడా చెప్పారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

కల్యాణలక్ష్మీ సాయం పెంచుతాం
——————————————–
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు చేయూత అందిస్తామన్నారు. ఆశా వర్కర్లకు కూడా జీతాలు పెంచబోతున్నాం. కల్యాణలక్ష్మీ సాయం, ఆశా వర్కర్ల వేతనాల పెంపునకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని తెలిపారు. మన జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వ వైద్యులకు సెల్యూట్
—————————————–
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్యులకు త్వరలోనే ఇన్సెంటివ్ పెంచుతామని చెప్పారు. గర్భిణీలు, బాలింతలను ఆదుకుంటున్నామని.. కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటుందన్నారు. కేసీఆర్ కిట్లతో 2 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రసవాలు పెరిగాయన్నారు. కేసీఆర్ కిట్లతో సీజేరియన్లు తగ్గాయి. మన ఆరోగ్య శ్రీ పథకాన్ని కేంద్రం కాపీ కొడుతుందని సీఎం తెలిపారు.

జూన్ 2 నిజమైన విమోచన దినం
———————————————–
విమోచన దినం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ విమోచన దినం అని పేరు పెట్టింది వీళ్లు అని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీళ్లకు ఓ ఉద్దేశం ఉంటది. అది ప్రపంచానికి తెలుసు అని సీఎం తెలిపారు. నిజాం సంస్థానం నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యంగా రూపాంతరం చెందింది. అది విమోచన కాదు.. పాడు కాదు.. ఒక్కొక్కరు ఒక పేరు పెడుతారు. భారతదేశంలో విలీనం అయిపోయాం.

శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు. తెలంగాణకు చెడ్డపేరు తీసుకువచ్చే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వను. తెలంగాణ విమోచనం దినం జరపాలనే బీజేపీ డిమాండ్‌లో అర్థం ఏమిటో అందరికీ తెలిసిందే. తెలంగాణకు అసలైన విమోచన దినం జూన్ 2, దాన్ని ఘనంగా జరుపుతాం. ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజే అసలైన విమోచన దినం. కుల, మతాలను రెచ్చగొట్టే రోజులు నిర్వహించాలంటే మేం నిర్వహించం అని సీఎం స్పష్టం చేశారు.

ఇటీవలే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జెండాలు పెడితే చాలా విమర్శలు వచ్చాయి. రాష్ర్టాలకు జెండాలు ఎందుకని పలువురు ప్రశ్నించారు. ప్రజలు సోదరభావంతో మెలగాలి. ముస్లింల నుంచి విమోచనం అయినట్లు ఈ రైటిస్టులు చిత్రీకరిస్తారు. అది బీజేపీ కోణం. మీ కోణం మాకు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దు. ప్రజలను కలిపి తీసుకుపోవాలి. జూన్ 2 కంటే మించింది కాదు కదా? విమోనం అని ప్రశ్నించారు. జూన్ 2 నిజమైన విమోచన. తెలంగాణ ప్రజలకు నిజమైన విమోచన ఆ రోజే. జూన్ 2న ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat