సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితో ఖచ్చితంగా ప్రేమలో పడతారు అని హీరోయిన్ల మీద ఉన్న ప్రధాన టాక్.అది నిజమే అంటుంది అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ .ఆమె ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటివరకు రెండు సార్లు పీకల్లోతు ప్రేమలో పడ్డాను అని చెప్పుకుంటూ వచ్చింది.
ఇంటర్వ్యూ లో ఇప్పటివరకు ఎవరితో అయిన ప్రేమలో పడ్డారా అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ నిజం చెప్పాలంటే నేను రెండు సార్లు ప్రేమలో పడ్డాను.అది సినిమాల్లోకి రాకముందు ఒకరిపై ప్రేమ పుట్టింది.అప్పుడు చెప్పే ధైర్యం లేక..చెబితే ఏమంటాడో అని చెప్పలేదు .
తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరొకరి మీద ప్రేమ కల్గింది.ఎంతగా అంటే పీకల్లోతు అని చెప్పుకుంటూ వచ్చింది కానీ అతను ఎవరో చెప్పకుండా సమాధానం దాటేసింది అమ్మడు ..మరి ఇంతటి అందగత్తె ప్రేమను సంపాదించుకున్న హీరో ఎవరో మరి కాలమే చెప్పాలి ..