తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామని..తెలంగాణ రాష్ట్రం ప్రారంభంలో ఇమ్యునైజేషన్ 65 శాతం ఉంటే.. ఇప్పుడు దాన్ని 90 శాతానికి తీసుకువచ్చామన్నారు.40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని..ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసే కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు.
