తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహరచన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆచరణ వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి. నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్లాలో అతిపెద్ద అపరెల్ హబ్ ఏర్పాటు కానుంది. సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటుకు సచివాలయంలో ఒప్పందాలు మార్చుకున్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడతుఊ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని ఇందుకోసం ఆయన తమకు లక్ష్యం నిర్దేశించారని వివరించారు.
see also :త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?
నేత కార్మికుడి ఇంట్లో ఉండి విద్యాభ్యాసం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అనంతరం వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. గత బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 1200 కోట్లు కేటాయించారని తెలిపారు. `50 శాతానికి పైగా మరమగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నయి. సూరత్, బివాండీకి వలసపోయిన నేతన్నలు తిరిగి స్వరాష్ర్టానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నం. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు తెలంగాణలో శ్రీకారం చుట్టాం. నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నం. నేత కార్మికులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని అండగా ఉంటున్నాం` అని వివరించారు.
see also :సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్
` నేతన్నలకు చేయూత పథకంతో సామాజిక భద్రత కల్పిస్తున్నామని వివరించారు. నేతన్నలకు కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. తిర్పూర్‌లో వస్త్ర ఉత్పత్తిపై అధ్యయనం చేశాం. తెలంగాణ టెక్స్‌టైల్స్, అపారెల్ విధానం తీసుకోచ్చాం. సిరిసిల్ల రూపురేఖలు మార్చేలా పరిశ్రమ వస్తోంది.ప్రభుత్వ భాగస్వామ్యంతో అపరల్ సూపర్ హబ్‌ను రూ. 100 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభించనుంది. వస్త్ర రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం.` అని వెల్లడించారు. వలస వెళ్లిన వారు స్వరాష్ట్రానికి వచ్చేలా, ఇక్కడు న్నవారు గౌరవ ప్రదమైన జీవితం గడిపేలా చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. తమ జీవితాల్లో మార్పు వచ్చిందని రెట్టింపు భత్యాలను పొందుతున్నామని వారు తనతో సంతోషాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు.