ఏపీ లో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి పార్టీ ఫిరాయించారు.
See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!
ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద చట్టపర చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు.ఈ వ్యాజ్యం మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ,ఏపీ అసెంబ్లీ కార్యదర్శి,న్యాయశాఖ కార్యదర్శి కి నోటీసులు జారీచేసింది.
See Also:వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..
అయితే పార్టీ మారి మంత్రి పదవులను అనుభవిస్తున్న ఎన్ అమరనాథ్ రెడ్డి ,సుజయక్రిష్ణ రంగారావు,ఆదినారాయణ రెడ్డి ,భూమా అఖిల ప్రియకు మంత్రి పదవుల్లో కొనసాగే అవకాశం లేకుండా అనర్హత వేయాలని ..వారి మంత్రి పదవులను రద్దు చేయాలనీ కూడా రాంబాబు హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో పేర్కొన్నారు.తదుపరి విచారణకు రెండు వారాల వాయిదా వేసింది ..