వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల
నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వైసీపీలో చేరనున్నారు అని వార్తలు గుంటూరు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!
ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ త్వరలోనే జగన్ పాదయాత్ర ముగిసేలోపు తన కుమారుడుతో సహా వైసీపీ గూటికి రానున్నారు.ఇప్పటికే వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డితో సంప్రదింపులు జరిపారు.ఈ చర్చల్లో భాగంగా కన్నాకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ,తన తనయుడికి పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరినట్లు తెల్సిందే.ఇదే అంశం మీద విజయసాయిరెడ్డి జగన్ తో చర్చించగా కన్నాకు గుంటూరు పశ్చిమను కేటాయించి.కన్నా తనయుడుకి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత పదవినిచ్చి సముచిత స్థానాన్ని ఇద్దామని చెప్పాడు.
see also :తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!
దీంతో కన్నా లక్ష్మీ నారాయణ అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగా మాట మీద నిలబడే వ్యక్తీ.అందుకు ఇటివల వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి మాటిచ్చిన ప్రకారం ఎమ్మెల్యే సీటు ఇవ్వడం ..వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ పదవిఇవ్వడం చూసి నమ్మకంతో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర జిల్లాలో ముగిసేలోపు భారీ బహిరంగ సభను నిర్వహించి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా ఇటివల ఎంపీగా పదవి కాలం పూర్తిచేసుకున్న అత్యంత సీనియర్ నాయకుడుతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు అంట .అయితే అది రానున్న ఉగాది పండుగ పర్వదినమే మంచి ముహుర్తమని తన అనుచవర్గం దగ్గర చర్చించారు అంట .చూడాలి మరి కన్నా పార్టీలో చేరతారో లేదో ..
See Also:వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..
see also :కేటీఆర్ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మన్ ఫిదా..!