తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..!
సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మండలి చైర్మన్ స్వామీ గౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసిన సంగతి తెల్సిందే.నిన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ తగిలి మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయమైన సంగతి తెల్సిందే.
అయితే ఈ సంఘటన మీద విచారణ చేసిన శాసనసభ వ్యవహారాల కమిటీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్ (ఆలంపూర్),మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ )ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తీర్మానాన్ని సభ వ్యవహారాల కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపించినట్లు సమాచారం.దీంతో ఒకవేళ ఈసీ విచారణ చేసి అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని అనుమతిస్తే త్వరలోనే ఉప ఎన్నికలు జరగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు ..