ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద దద్దమ్మలు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేతలపై, వైసీపీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రోడ్లవెంబడి తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జగన్ కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. వైఎస్ జగన్.. చంద్రబాబును విమర్శించడానికి ముందు నీపై ఉన్న వందలకొద్ది కేసులను గుర్తు తెచ్చుకో అంటూ హితవు పలికారు.
see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
see also : చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ప్రజారాజ్యం పార్టీలానే కాంగ్రెస్‌లో విలీనమవుతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. జగన్ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.