తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 5 లక్షల బీమా కల్పిస్తామని రైతు సమన్వయ సమితి సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2) నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఒకటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత యోచించారు. కానీ, ఇంతవరకూ రైతులెందరనే లెక్కలింకా పక్కాగా తేలకపోవడం, ప్రీమియం చెల్లింపునకు నిధుల విడుదలలో బడ్జెట్ పరంగా సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని జూన్ 2 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించారు.
see also :కేసీఆర్‌ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియర్ ఐఏఎస్
బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేaటాయించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. కానీ, ఎల్‌ఐసీతో చర్చించిన తరవాత ప్రీమియం సొమ్ము రూ.600 కోట్లను దాటే అవకాశాలున్నాయని అంచనా. భూముల పత్రాల పరిశీలన ఆధారంగా రాష్ట్రంలో రైతుల సంఖ్య 71.75 లక్షలుగా రెవెన్యూ అధికారులు నివేదించారు. అయితే, క్షేత్రస్థాయిలో పంట సాగుచేసేవారిని మాత్రమే ‘రైతు’గా గుర్తించాలని పేర్కొంటూ మరోసారి పరిశీలన జరపాలని ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ శాఖను ఆదేశించింది. గ్రామాలు, పట్టణాల సమీపంలో ఆస్తుల రూపంలో కొని నిరుపయోగంగా భూములు ఉంచితే.. వాటి యజమానులను రైతులుగా గుర్తించొద్దని ప్రభుత్వం సూచించింది.
see also :టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
మరోవైపు వ్యవసాయశాఖ గత జూన్‌లో చేసిన అధ్యయనం ప్రకారం 45 లక్షల మంది పంటలు సాగుచేస్తున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. మరో 10 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ వారి భూములు వివాదాల్లో ఉన్నట్లు వివరించింది. ఇవన్నీ కలిపినా మొత్తం రైతుల సంఖ్య 55 లక్షలు దాటదని వ్యవసాయ శాఖ అంచనా. కానీ అసైన్డ్ భూములు సాగుచేస్తున్నవారినీ కలిపితే 71.75 లక్షల మంది రైతులున్నట్లు రెవెన్యూశాఖ వివరించింది. ఈ లెక్కల గందరగోళాన్ని త్వరగా తేల్చి గత వానాకాలం, ప్రస్తుత యాసంగిలో వాస్తవంగా పంటలు సాగుచేసిన రైతులను గుర్తించి వారి సంఖ్యను తెలపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదంతా మరోవారం రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. గరిష్ఠంగా 60 లక్షల మంది వరకూ రైతులున్నట్లు తేల్చేస్తారని అంచనా.
see also :చంద్రబాబు దొంగ లెక్కలు ..పక్క ఆదారాలతో డోన్ వైసీపీ ఎమ్మెల్యే
వీరిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షలజీవిత బీమా చేయించాలంటే ‘సంయుక్త బీమా పథకం’ కింద కనీసం రూ.1000 చొప్పున ప్రీమియం కట్టాలని అంచనా. ఈ లెక్కను తీసుకుంటే కనిష్ఠంగా రూ.600 కోట్లను ప్రీమియంగా కట్టాల్సి ఉంటుందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. కానీ ప్రీమయం రూ.1000 సరిపోతుందా లేక ఇంకా ఎక్కువ అవసరమా అన్నది ఎల్‌ఐసీ ఇంకా ఏమీ చెప్పలేదు. పైగా ఒకే బీమా కంపెనీతోనే పథకం అమలుచేయాలా లేక మరిన్ని కంపెనీలకు అమలు బాధ్యత అప్పగించాలా అన్నదానిపైనా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియంతా పూర్తయి బడ్జెట్ నుంచి నిధులు విడుదల కావాలంటే మే వరకూ సమయం పడుతుందని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పథకం అమలు చేయాలని నిర్ణయించారు. రైతు కన్నుమూస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించాలన్నది పథకం లక్ష్యం. ప్రస్తుతం రైతులు ఆత్మహత్య చేసుకుంటే తక్షణ పరిహారంగా రూ.5 లక్షలు ఇచ్చి మరో రూ.లక్ష అప్పులకు చెల్లిస్తున్నారు. బీమా పథకం అమల్లోకి వస్తే ఆత్మహత్య చేసుకున్నవారికి సైతం దీనికిందనే పరిహారం వస్తుందని అంచనా.