ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.
అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోదా పాట ఎత్తుకున్నారు.
గత నాలుగు ఏండ్లుగా అన్ని లక్షల పెట్టుబడులు ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయని గబ్బలు కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్ననించారు.రాష్ట్రంలో కానీ దేశంలోని కానీ పెట్టుబడులు వచ్చాయంటే దానికి కారణం ప్రధాన మంత్రి నరేందర్ మోదీ వలన అయిందని ..బాబుకు అంత సీను లేదని ఆయన అన్నారు .దమ్ముంటే ఈ విషయం మీద చర్చకు రావాలని ఆయన బాబుకు సవాలు విసిరారు ..