Home / POLITICS / కేసీఆర్ అంత ద‌మ్ముతో స‌వాల్ చేయ‌గ‌ల‌రా..? మ‌ంత్రి కేటీఆర్‌

కేసీఆర్ అంత ద‌మ్ముతో స‌వాల్ చేయ‌గ‌ల‌రా..? మ‌ంత్రి కేటీఆర్‌

న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, వేముల వీరేశం, రవీంద్ర నాయక్, పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్, నల్గొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

see also :దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మునుగొడు నియోజికర్గంలో ఫ్లోరైడ్ భూతం పట్టి  పీడిస్తున్నదని, ఫ్లోరైడ్ బాధితులను చూస్తే  కన్నీళ్ళు వస్తాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్లనే ఫ్లోరైడ్ భూతం విజృంభించిందని మండిప‌డ్డారు. ఆనాడే సీఎం కేసీఆర్ సిద్ధిపేటకు ఇంటిటికి నీళ్ళు ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం అయిన అనంత‌రం రాష్ట్రం అంత ఇంటింటికీ కులాయిల ద్వారా మంచి నీటిని అందిస్తామ‌ని ప్ర‌క‌టించి అలా చేయ‌క‌పోతే ఓట్లు అడగను అన్న దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. `మునుగోడులో ఉపరితలంలో నీళ్ళు పారించి ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం చూపుతాం. కాంగ్రెస్ నేతలు దిగజారి  ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు పిచ్చి లేచింది. అధికారం కోసం అర్రులు చేస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకు ఒక్క పైసా ఇవ్వను అంటే ఎవ్వరు మాట్లాడలేదు. తెలంగాణ వాళ్లకు పరిపాలన రాదు అని కిరణ్ కుమార్ రెడ్డి అవహేళన చేస్తే  సిగ్గు లేకుండా నోరు మూసుకున్నారు.` అని మండిప‌డ్డారు.

see also :చంద్రబాబుకు ప్రజల తరపున పోరాడే దమ్ము లేదు ..!

కాంగ్రెస్ వాళ్ళు  రైతులను కాల్చి చంపారు ఇప్పుడు నాటకాలు ఆడుతూ రైతు జపం చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్‌ మండిప‌డ్డారు. `రైతులకు తెలంగాణా ప్రభుత్వం  ఎం  చేయలేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ఎరువులు , విత్త‌నాలు సకాలంలో ఇస్తున్నాము. ఈ దేశంలో రైతులకు పెట్టుబడి అందించే నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే. బస్సు యాత్ర పెట్టి కాంగ్రెస్ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు…. ప్రజల్లో అబాసూ పాలవుతున్నారు` అని వ్యాఖ్యానించారు. `చేనేతలకు చేయుత అందిస్తున్నాము. కుల వృత్తిలకు పూర్వ వైభవం తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదు….కడుపు మండుతున్నది. ప్రతి ఊరిలో అర్హులకు అందరికి పెన్షన్ లను అందిస్తున్నాము. 42 లక్ష  ల మందికి పెన్షన్ లను అందిస్తున్నాము. అడ కూతురు కన్న తల్లి దండ్రులకు భారం కావొద్దని కళ్యాణ లక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. సన్న   బియ్యం తో విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెడుతున్నాము. స‌ర్కార్ ఆసుపత్రుల్లో  కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నాము. 514  గురుకుల స్కూల్ లను ఏర్పాటు చేసాము. అన్ని రంగాల్లో తెలంగాణా  బ్రహ్మాంఢంగా  ముందుకు దూసుకుపోతున్నది.` అని స్ప‌ష్టం చేశారు.

see also : అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!

కోమటిరెడ్డి అసెంబ్లీలో చేసిన దాడికి జానారెడ్డి ఏం సమాధానం చెప్తారు……ఏం చర్యలు తీసుకుంటారు అని మంత్రి కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. `కాంగ్రెస్ నాయకుల మాయ మాటలను ఎవ్వరు నమ్మొద్దు. నిన్న మొన్నటి దాక ప్రజలను నానా అవస్థల పాలు జేసిన కాంగ్రెస్ నేతలు మొసలి   కన్నీరు కారిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఘట్టుప్ప‌ల్‌  మండలంగా వస్తుంది. చౌటుప్పల్ లోని  దండుమల్కాపురం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నాము` అని ప్ర‌క‌టించారు.

చండూరు ప్రగతి సభ ప్రత్యక్ష ప్రసారం

చండూరు ప్రగతి సభ ప్రత్యక్ష ప్రసారం

Posted by TRS Party on Monday, 12 March 2018

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat