ప్రభుత్వ పరిపాలన ఇంటింటికీ చేరాలని అందుకు సాంకేతిక సాధనంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రం ప్రవేశపెట్టని పథకంతో తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఇందుకోసం ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పథకాన్ని రూపొందించామన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్ ప్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎఫ్‌సీఎల్) గూపునకు చెందిన ఆప్టికల్ ఫైబర్ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, స్థానిక సర్పంచ్ జెల్లల లక్ష్మయ్యతో కలిసి భూమి పూజ చేశారు.
see also : ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!
కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ పథకం ద్వారా గ్రామం వరకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవగా తాము ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఇచ్చేందుకు టీ ఫైబర్ ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఇందులోని టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్ ప్రదర్శించామన్నారు. ‘పరిపాలన ఇంటింటికీ చేరువ కావాలి. విద్య, వైద్యం వంటివన్నీ టెక్నాలజీ ఆధారితంగా ప్రజలు నేరుగా పొందే అవకాశం ఉండాలి. ప్రతి స్మార్ట్ టీవీ ఈ సేవలను అందించేందుకు వేదికగా ఉండాలి. అందుకే మేం ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను కేంద్రంగా తీసుకొని ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు.
see also :దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!
హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థ మొదటి దశలో ఫైబర్ తయారీ, తదుపరి దశలో కేబుల్ మూడో దశ విస్తరణలో ఆఫ్టిక్ ఫైబర్ కేబుళ్ల ముడిసరుకును ఈ కంపెనీ తయారు చేయడం సంతోషకరమన్నారు. 4000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానికంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటూ అయితే ఈ ఫలాలు యువతకు అందాలని ఆకాంక్షించారు. అందుకే టాస్క్ ద్వారా సంస్థకు అవసరమైన శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ విషయంలో స్థానికులకు సహకరించాలని సహకరించాలని ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కోరారు. దేశంలో ఆప్టిక్ ఫైబర్ తయారీ సంస్థలు కేవలం నాలుగు మాత్రమే ఉండగా అందులో కీలక సంస్థతెలంగాణలో తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. డిఫెన్స్ రంగంలోకి కూడా విస్తరించాలని హెచ్‌ఎఫ్‌సీఎల్ ఆకాంక్షించడం సంతోషకరమని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇటీవలే కేంద్ర రక్షణ శాఖ మంత్రి హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక టాటా బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.
Laid the found for HFCL’s (Himachal Futuristic Communications Ltd) 1000Cr plus project that will manufacture Fibre, Cable & the backward integration into fibre components
3000 plus jobs to be created in all & project to be completed in couple of years at Raviryal, RR Dist pic.twitter.com/9W9npVLXlx
— KTR (@KTRTRS) March 12, 2018