తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ ఫోన్ విరిచి మరి గవర్నర్ మీదకు విసిరాడు.అయితే అదృష్టశావత్తు అది గవర్నర్ కు తగలకుండా పక్కన ఉన్న శాసనమండలి స్పీకర్ స్వామీ గౌడ్ ముందు పడింది.అయితే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గవర్నర్ మీద దాడికి తెగబడ్డారు అని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ..
