తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
see also :రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!
ఈ సందర్భంగా ఉద్యమనేత ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు గుడి వంశీ ధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కు వంశీధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పోరాట యోధుడైన కేసీఆర్ వెంట నడిచి ఆయనకు కొండంత అండగా సంతన్న ఉన్నారని వంశీధర్ ఈ సందర్భంగా కొనియాడారు.
see also :జగన్ పాదయాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వగానే.. వైసీపీలోకి మాజీ మంత్రి..!!
see also :సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి