ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.
See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!
తాజాగా రాష్ట్రంలో టీడీపీ హయంలో మంత్రిగా పనిచేసి ఇటివల మంత్రి పదవికి రాజీనామా చేసిన ఒకరు జనసేన పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అసలు విషయానికి వస్తే టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మంత్రిగా పని చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదనే నెపంతో కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు సుజనచౌదరి ,అశోక గజపతి రాజు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.
See Also:తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!
ఈ క్రమంలో ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మాణిక్యాల రావు ,కామినేని శ్రీనివాసరావు కూడా రాష్ట్ర మంత్రి వర్గానికి రాజీనామా చేశారు.ఈ క్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పవన్ జనసేన పార్టీలో చేరనున్నారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈవార్తల్లో ఎంతవరకు నిజముందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ..!
See Also:చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!