తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటివల జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీ గురించి మరో విషయం తెలిపారు.నిన్న ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగిన సంగతి విదితమే.
ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల గురించి ,నేడు సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి ,జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ గురించి చర్చించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ ప్రజల స్థితి గతిని మార్చడానికే నేను నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తున్నాను.
అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలు 2019వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను అని ప్రకటించారు.అంతే కాకుండా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు..