ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్‌సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల కోట్ల 434 పెరిగిందన్నారు. ఈ లెక్క గత డిసెంబర్ వరకేనని, జనవరి, ఫిబ్రవరిలో ఇంకెంత అప్పు చేశారోనంటూ అనుమానం వ్యక్తం చేశారు.
see also : ”ఓటుకు నోటు కేసు”పై మోడీ సంచలన నిర్ణయం..! చంద్రబాబుకు ఇక జైలే గతి..!!
see also : ఒక్కపాటతో చంద్రబాబుకు చుక్కలు చూపించిన సామాన్యుడు ..!
ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ప్రత్యేక హోదాతో సమానంగా రూ.3 లక్షలా 30 వేల కోట్లు ఇస్తే.. ఆ నిధులన్నింటినీ చంద్రబాబు సర్కార్ ఎలా ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నెల్లూరులోనే మరుగుదొడ్లు నిర్మిస్తామంటూ టీడీపీ నేతలు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అలాగే, నీరు చెట్టు నిధులు రూ.500 కోట్లను స్వాహా చేశారన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన జరుగుతోందన్నారు పురందేశ్వరి. అవినీతే ధ్యేయంగా చంద్రబాబు తన పాలనను కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే పోలవరం, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు, ఇలా చంద్రబాబు సర్కార్ సంక్షేమ పథకాలంటూ చేపట్టిన కార్యక్రమాలకు ఖర్చుపెట్టిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై..!!
రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్‌షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్దికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి.