తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు.
see also :మద్యం త్రాగి అసెంబ్లీకి వచ్చిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
ఇక బహుజన సమాజ్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ మారడంతో ఆ పార్టీను కూడా వీలినం చేశారు.తాజాగా జాతీయ పార్టీగా ఉన్న సీపీఐ పార్టీ కూడా టీఆర్ఎస్ లో వీలినమైనట్లు వార్తలు వస్తున్నాయి.గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ మారడంతో వీలినం చేస్తునట్లు ఆయన లేఖ ఇచ్చారు అని సమాచారం..
see also :ఒక్కపాటతో చంద్రబాబుకు చుక్కలు చూపించిన సామాన్యుడు ..!