తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను ఖరారు చేసినట్లు ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు .ఈ సందర్భంగా ఉద్యమనేత ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల గ్రేటర్ వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.
