ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.వారంతం కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు.శ్రీవారిని దర్శించుకునే భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం
కాగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో ఆయన తన తండ్రి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథరావుతో వచ్చి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
see also :2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!