రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని ఆమె అన్నారు.
See Also:టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!
అంతే ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో దగ్గుబాటి వారసుడు అయిన దగ్గుబాటి రానాతో రకుల్ ప్రీత్ సింగ్ పీకల్లోతు ప్రేమలో పడింది.ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు .ఇక పెళ్ళే తరువాయి అని వార్తలను తెగ ప్రసారం చేయడం జరిగింది.అయితే తనపై వస్తున్న వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చారు.
See Also:ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..!
ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ గతంలో నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అలా ఉండాలి ..ఇలా ఉండాలని వివరించాను .అంతే ఇండస్ట్రీలో ఆరు అడుగుల ఉన్న ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలను ప్రసారం చేశారు .ఏకంగా పెళ్లి కూడా చేస్కోబోతున్నాం అని కూడా చెప్పేశారు .ఈ వార్తలను చూడగానే చదవగానే మేమిద్దరం నవ్వుకున్నాం .అయిన మేము ఇద్దరం మంచి దోస్తులం .మా మధ్య అలాంటివి ఏమి లేవు అని ఆమె క్లారిటీ ఇచ్చారు .