ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు వరసగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ల మీద షాకులిస్తున్నారు.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ప్రజలకు సేవ చేయాలనీ ఆయన స్థాపించిన టీడీపీ పార్టీలో చేరిన ప్రముఖ సీనియర్ నటి ,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయిన కవిత ఆ పార్టీకి రాజీనామా చేశారు.
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ.?
టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎంపీ కంభంపాటి హరిబాబు సమక్షంలో బీజేపీ పార్టీ గూటికి చేరారు.ఈ సందర్భంగా హరిబాబు ఆమెకు కమలం కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
See Also:టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డవారికి ,కష్టకాలంలో అండగా ఉన్నవారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదు.మహిళలకు అయితే కనీసం గౌరవం లేదని ఆమె వాపోయారు.అయితే నేను పార్టీ నుండి బయటకు రాలేదు .నన్ను గెంటేశారు అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు .