ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23 జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్థులను ఖరారు చేసినట్లు బాబు ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు .అందులో భాగంగా టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ ,కనకమేడల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసినట్లు ఆ మీడియా ప్రకటనలో ఆ పార్టీ తెల్పింది.
see also :సీఎం కేసీఆర్ పై చంద్రబాబు సన్నిహితుడు ప్రశంసల వర్షం..!
అయితే ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ కు మరొకసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు ,మంత్రులు ,ఎమ్మెల్యేలు తో భేటీ అయిన చంద్రబాబు నాయుడు వీరిద్దరి పేర్లను ఖరారు చేసినట్లు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ రేపే సోమవారం చివరి తేది కాగా పదమూడో తారీఖున నామినేషన్లను పరిశీలిస్తారు.ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి .
see also :ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్