దక్షిణ ఆయోధ్యగా పేరుగాంచిన భద్రచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ నెల 26 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక,గోడ పత్రికను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆవిష్కరించారు.
see also :షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!
మిథిల ప్రాంగంణంలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.కళ్యాణ శోభ ఉట్టిపడేలా మండపాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. స్వామి వారి కళ్యాణానికి అందరు అహ్వానితులేనని ఆహ్వానం పలికారు.
see also :జగన్‌పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!