రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల్లో సహజంగా ఏం జరుగుతుంది? బలం ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. మద్దతు లేని వారు తమ పనేదో తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నం! తమకేమాత్రం బలం లేకున్నా..కేవలం మీడియాలో కనిపించేందుకు…వార్తల్లో ఉండేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం పార్టీని కామెడీ పాలు చేసేదేనని స్వయంగా కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటుండటం గమనార్హం.
see also :మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన ట్వీట్..!!
ఇంతకీ విషయం ఏంటంటే…తెలంగాణలో మొత్తం మూడు స్థానాలకు ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్‌కు సంఖ్యబలం ఉండటంతో ఈ మూడు స్థానాలూ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోందని అన్ని వర్గాలు చెప్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ఓ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సీ కుంతియా, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం
ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలోకి దించాలని చర్చించింది. అయితే ఈ నిర్ణయానికి పార్టీ నేతలే ముందుగా అడ్డుచెప్పడం గమనార్హం. పోటీ పెట్టాల్సిందేనని పలువురు నేతలు వ్యాఖ్యానించగా..మరికొందరు విబేధించారు. పోటీ పెట్టడం వల్ల గెలిచే పరిస్థితి లేదని, పోటీలోకి దిగడం అనవసరమని కొందరు వాదించారు. అయితే పోటీకి సిద్ధపడ్డారు. కాగా, తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకే కాంగ్రెస్ ఇలా చేసిందని… ఓడిపోతామని తెలిసినా ఎందుకీ నిర్ణయమని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఓటమి ఖాయమని, నవ్వుల పాలు అవడం తప్పదని కాంగ్రెస్ నేతలే చర్చించుకోవడం కొసమెరుపు!!