సాయిపల్లవి ఫిదా అనే ఒక్క మూవీతో తెలుగు ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ తెలంగాణ యాష భాషలో డబ్బింగ్ చెప్పి కుర్రకారును తన బుట్టలో వేసుకున్న ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా లో ,కొన్ని వార్త
పత్రికల్లో ,ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.
తన తనయుడిపై వస్తున్నా వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తనయుడు రవితేజ ,హీరోయిన్ సాయిపల్లవి గురించి వస్తున్నా వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు.
సినిమా వాళ్ళ మీద ,ప్రముఖుల మీద ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణమే .అవాస్తవమైన కల్పిత వార్తలతో వారి భవిష్యత్తును నాశనం చేయద్దు.వారి మనోభావాలను ,వ్యక్తిగత విషయాలపై లేనిపోని వార్తలను ప్రచారం చేయద్దని ఆయన విజ్ఞప్తి చేశారు .