Home / TELANGANA / వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..!

వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పథకానికి ‘రైతులక్ష్మి’ అని నామకరణం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందు కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. లబ్ధిదారులకు కింద ఈ పథకం ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50,000 దాటినట్లయితే రెండు చెక్కుల్లో ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఒక్క చెక్కుపై పేర్కొనే మొత్తం రూ. 49,999కు మించి ఉండవద్దని నిర్ణయించింది. లబ్ధ్దిదారుల భూవిస్తీర్ణం ఎక్కువగా ఉండి ఇంతకంటే ఎక్కువ సాయం అందుకోవాల్సి వస్తే మరో చెక్కు రూపంలో ఉంటుంది. వచ్చే నెల 20వ తేదీన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మే 15వ తేదీకల్లా మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది.

see also :భారతదేశ అభివృద్ధి ఎజెండా రూపకల్పన జరగాలి..కేసీఆర్

ఇప్పటికే లబ్దిదారుల వివరాలను సిసిఎల్‌ఏ సిద్ధం చేస్తూ ఉన్నందున వారికి ఉన్న భూమినిబట్టి ప్రభుత్వం చెక్కు రూపంలో ఎంత సాయం చేయాలనేదానిపై వ్యవసాయ శాఖ కమిషనర్ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 71 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధి దారులు ఉంటున్నందువల్ల వారి వివరాలన్నింటినీ శుక్రవారం సాయంత్రంకల్లా సిసిఎల్‌ఎ అందజేయాల్సి ఉంటుందని, ఆ వివరాల మేరకు బ్యాంకులు చెక్కుల ముద్రణను ప్రారంభించాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు.

see also :

రైతులకు ఇస్తున్న చెక్కుల్లో అక్షర దోషాలు తలెత్తినా, భూమి లెక్కల ప్రకారం సాయం అందకపోయినా, ఇతర ఫిర్యాదులున్నా పరిష్కారం కొరకు వ్యవసాయ శాఖ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్దం చేస్తోంది. రైతుల నుంచి అందిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించే విధంగా ఇప్పటికే రూపకల్పన జరిగినట్లు తెలిసింది. భూ రికార్డుల వివరాలను అవసరాన్ని బట్టి అందించడానికి ఈ ప్రత్యేక వ్యవస్థ రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరు జాతీయ బ్యాంకులతో పాటు రెండు ప్రాంతీయ బ్యాంకులకు సైతం చెక్కుల ముద్రణ బాధ్యతలను అప్పజెప్పిన ప్రభుత్వం వచ్చే నెల 19వ తేదీకల్లా తొలి విడత చెక్కులు సిద్ధం కావాలని బ్యాంకులకు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. చెక్కులను ముద్రిస్తున్న ఆరు బ్యాంకుల్లో ‘వ్యవసాయ శాఖ కమిషనర్’ పేరుతో ఖాతాలను తెరవాలని, జిల్లాలవారీగా అవసరం లేదని రెండు రోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం జరిగింది.

see also : బిగ్ బ్రేకింగ్‌: భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా..!!

చెక్కుల ముద్రణలో సింహ భాగం భారతీయ స్టేట్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకులవే కాబట్టి పది లక్షల కంటే ఎక్కువ చెక్కులను ముద్రించాల్సి వస్తున్నందున సాంకేతిక (సాఫ్ట్‌వేర్) ఇబ్బందుల దృష్టా వ్యవసాయశాఖ కమిషనర్ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ప్రతి చెక్కు మీద కేవలం ఆరు అంకెల నెంబర్లు మాత్రమే ముద్రించడం సాధ్యమవుతున్నందువల్ల గరిష్టంగా ఒక ఖాతా పేరుతో 9,99,999 చెక్కులను మాత్రమే జారీ చేయడం సాధ్యం కాబట్టి ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఒకటికంటే ఎక్కువ ఖాతాలను తెరవాల్సి వస్తుందని బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశంలో వివరించారు.

see also :అభిమానుల‌కు షాకిచ్చిన ప‌వ‌న్‌ కళ్యాణ్..!

ఏ మండలానికి సంబంధించిన చెక్కులను ఏ బ్యాంకు ముద్రించాలన్నదానిపై ఇప్పటికే పట్టిక తయారుచేసినట్లు తెలిసింది.మొదటి విడత పంపిణీ అయ్యే చెక్కులపైన తేదీని ఏప్రిల్ 19, రెండవ విడత చెక్కులపై ఏప్రిల్ 30, మూడవ విడత చెక్కులపై మే 15 అని ముద్రించాల్సిందిగా బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ముద్రించిన చెక్కులను గ్రామాలవారీగా తయారుచేసి మండలాలవారీగా కట్టలుకట్టి హైదరాబాద్‌లో అప్పజెప్పే విధంగా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వ్యవసాయ శాఖలో సిబ్బంది, అధికారుల మధ్య పని విభజన కూడా జరుగుతోంది. చెక్కులపైన లబ్ధిదారుల పేరుతో పాటు వారి పట్టాదారు పాస్‌బుక్ నెంబర్‌ను కూడా ముద్రించే విధంగా బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిన తర్వాత సర్వే నెంబర్లు, భూ విస్తీర్ణం, ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయడం తదితరాలన్నీ సిద్ధంగా ఉన్నందున పాస్‌బుక్‌లు ముద్రణ అయినా కాకపోయినా ఆ నెంబరు ఆధారంగా చెక్కుల ముద్రణ, పంపిణీ ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat