తెలంగాణ రాష్ట్రంలో రేపు ( ఆదివారంమార్చి-11) రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36లక్షల 55వేల 204 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 11వ తేదీన పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు ఆ తర్వాత రెండురోజులు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో డ్రాప్స్ వేసేందుకు వైద్యశాఖ సర్వం సిద్ధం చేసింది.
see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!
see also :ఐదు కోట్ల ఆంధ్రుల ఆశాదీపం టీడీపీనా .. వైసీపీ నా ..?ఆలోచించండి ..!