తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో జరగబోయే కీలక ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి ఇవ్వనున్నామో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ప్రకటించారు.రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఓవైసీ ట్విటర్లో పేర్కొన్నారు.
see also :యువతీ బంపర్ ఆఫర్..!!
కాగా, రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖరారు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మొత్తం మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. టీఆర్ఎస్కు సంఖ్యబలం ఉండటంతో ఈ మూడు స్థానాలూ కైవసం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని రాజకీయవర్గాలు ధీమాగా చెప్తున్నాయి. ఈ నెల 12 వరకు నామినేషన్లు దాఖలు కాగా, 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరుగుతుంది.
see also :ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?