పలువురితో ఎఫైర్స్ నడిపిన నటీమణుల్లో నయనతారది ఎన్నో స్థానమో అన్న విషయం పక్కన పెడితే… దక్షిణాది సినీ ఇండస్ర్టీలలో మాత్రం ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతుండటం విశేషం. అయితే, ఈ హాట్‌బ్యూటీ నటించిన తాజా చిత్రం కర్తవ్యం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నాడు విజయశాంతి, నేడు నయనతార అనేలా తన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకునేలా తన నటనా ప్రతిభను ఆ టీజర్లో చూపించింది నయనతార. కొందరైతే ఒకడుగు ముందుకేసి నయనతార మరో లేడీ సూపర్ స్టార్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
see also : పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!!
see also : 2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
see also : బిగ్ బ్రేకింగ్: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!!
ఇదిలా ఉందగా.. కర్తవ్యం టీజర్ చూసిన వారంతా నయనతారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, కర్తవ్యం టీజర్లో నయనతార పలికిన డైలాగ్‌లు చంద్రబాబు అవినీతి ప్రభుత్వాన్ని గుర్తుకు తెస్తున్నాయనేది నెటిజన్ల అభిప్రాయం. ప్రజలకు ఏది అవసరమో అదే చట్టం అవ్వాలి కానీ, చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్ద కూడదు అంటూ నయనతార చెప్పిన డైలాగ్‌లు అచ్చం చంద్రబాబు అవినీతి ప్రభుత్వానికి సరిపడతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్ల అభిప్రాయానికి కారణం లేకపోలేదు. ఓ పక్క ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాను కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం తనపై ఉన్న ఓటుకు నోటు కేసుకు భయపడి కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్న విషయం తెలిసిందే. మరోపక్క ప్రత్యేక హోదాపై ఉద్యమానికి ఉపక్రమించిన ఏపీ ప్రజలను సైతం చంద్రబాబు తన అధికార బలంతో ఉద్యమాన్ని అణచివేసిన విషయం తెలిసిందే.