తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు.
see also :ఢిల్లీలో మంత్రి కేటీఆర్…వరుస సమావేశాలతో బిజీ బిజీ
బస్సు యాత్ర పేరిట అలీబాబా నలభై దొంగల బ్యాచ్ బయలుదేరి నోటికొచ్చిన భాష మాట్లాడారని అయన మండిపడ్డారు. బస్సు యాత్రలో పాల్గొన్న 40 మంది కాంగ్రెస్ నేతల్లో 33 మంది సీఎం అభ్యర్థులే అని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్రకు అంగడి యాత్రగా పేరొచ్చిందని…తెలంగాణలోని అన్ని పట్టణాల్లో అంగడి రోజు జనం సందడి కనిపిస్తుందని, అదే రోజుల్లో బస్సుయాత్ర నిర్వహించారని తెలిపారు. బోధన్ లో అదే జరిగిందని, అయినా జనం లేక బస్సుయాత్ర ఫెయిల్ అయ్యిందన్నారు.అది బస్సు యాత్ర కాదు తుస్సు యాత్ర అన్నారు.
see also :జగన్‌పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
మంత్రి కేటీఆర్ కు నీతులు చెప్పే జానారెడ్డి అడ్డగోలు భాష మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు నీతులు చెప్పరా? అని ప్రశ్నించారు..మంత్రి హరీశ్ రావును చంపేస్తానని ఒక కాంగ్రెస్ నేత బహిరంగంగా ప్రకటన చేశాడని, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? అని ఎ ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు మళ్లీ టిఆర్ఎస్ కే అధికారం ఇస్తారని తెలిపారు.
see also :2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!