రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే స్కోచ్ సమ్మిట్ 51వ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ప్రముఖ కంపెనీ అయిన జేకే పేపర్స్ వీసీ మరియు ఎండీ హెచ్‌పీ సింఘానియాతో భేటీ అవుతారు.
see also :షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!
అనంతరం సఫ్రీన్ సంస్థతో మంత్రి కేటీఆర్ కీలకమైన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఒబెరాయ్ హోటల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉంటారు. ఈ భేటీ అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.