ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనమీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు తమ పార్టీ ఎంపీలను ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారని, పైపైకి మా పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తన సొంత పత్రికలో ప్రకటనలు ఇప్పిస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. కాగా, ఇవాళ కళా వెంకట్రావు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
see also : కామెడీ చేసేందుకు టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమిది!
see also : రవితేజకి నో చెప్పిన “కాజల్ “..!
జగన్ తన స్వలాభం కోసం, స్వార్ధం కోసం స్థాపించిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అని ఎద్దేవ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం వైసీపీ ఎక్కడా కూడా పోరాటం చేయలేదన్నారు. ఎంతసేపు ఏదో ఒక విధంగా ఏపీ సీఎం చంద్రబాబ నాయుడుపై విమర్శలు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు.
తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడెప్పుడు దూరుదామా..!! అంటూ వెయిటింగ్ చేస్తున్నారన్నారు.